మైఖేల్ జాక్సన్ 'థ్రిల్లర్' జాకెట్ ధర 10 మిలియన్ డాల్సర్లు
మైఖేల్ జాక్సన్ 'థ్రిల్లర్' జాకెట్ ధర 10 మిలియన్ డాల్సర్లు - Visual
మైఖేల్ జాక్సన్ యొక్క ఐకానిక్ 'థ్రిల్లర్' జాకెట్ అబుదాబిలో వేలానికి సిద్ధమవుతుండటంతో సంగీత చరిత్రలో మరొక అరుదైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. డిసెంబర్ 7 నుండి 9 వరకు జరగనున్న ఈ అత్యంత ఆసక్తికరమైన వేలంలో, ఈ లెజెండరీ జాకెట్ ధర ఏకంగా 10 మిలియన్ డాల్సర్లుగా నిర్ణయించారు.
ప్రసిద్ధ జాకెట్‌తో పాటు, జాక్సన్ అద్భుతమైన కెరీర్‌కు చెందిన కస్టమ్ ఫెడోరా టోపీ మరియు పెర్ఫార్మెన్స్ లోఫర్లపై బిడ్ వేసే అవకాశాన్ని కూడా కలెక్టర్లు మరియు అభిమానులు పొందనున్నారు. ఈ వస్తువులను ఇటీవల ప్రిన్స్ జాక్సన్ ఒక ఛారిటీ కార్యక్రమంలో ప్రదర్శించారు, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు మరియు కలెక్టర్లలో భారీ ఉత్సాహాన్ని నింపింది.



Reader Comments (0)
No approved comments yet. Be the first to share your thoughts!